ఫోటోషాప్ లో కొత్త ప్లగ్గిన్స్ ని ఇన్ స్టాల్ చేసుకోవడం మరియూ వాడే విధానం—ఫోటోషాప్ ట్యుటోరియల్

నేను రెండు మూడు చోట్ల గమనించిన ప్రకారం ఫోటో స్టూడియో వాళ్ళకు కూడా ప్లగ్గిన్స్ ని వాడటం,ఇన్ స్టాల్ చెయ్యటం తెలియదు.
1700_Photoshop_Plugins_by_myszka011
అందువలన ఈ ట్యుటోరియల్ ఇక్కడ పెట్టడం వలన అందరూ నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.మరి ఇంకెందుకాలస్యం ఫోటోషాప్ ఓపెన్ చేసి ట్యుటోరియల్ ఫాలో అవ్వండి..


మొదటగా ప్లగ్గిన్స్ లో రకాలు మరియూ అవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం…ప్లగ్గిన్స్ నేడు ఆన్ లైన్ లో రెండు రకాలుగా లభిస్తున్నాయి.వాటిలో ఒకటి నేరుగా సెటప్ ఫైల్ ద్వారా ఇన్ స్టాల్ చేసేది.రెండవ రకం ఫోటోషాప్ రూట్ ఫోల్డర్ లోని plug ins ఫోల్డర్ లోనికి నేరుగా పేస్ట్ చేసి వాడుకునేవి.

ఇప్పుడు మొదటి రకం ప్లగ్గిన్స్ ని ఎలా ఇన్ స్టాల్ చెయ్యాలో చూద్దాం.ఇవి చూడటానికి క్రింద విధంగా ఉంటాయి.ఇక్కడ మూడు రకాల ప్లగ్గిన్ లను చూపించాము.
1

ఇప్పుడు మీరు ఏ ప్లగ్గిన్ అయితే ఇన్ స్టాల్ చెయ్యదలచుకున్నారో ఆ ప్లగ్గిన్ మీద డబుల్ క్లిక్ చెయ్యండి.తరువాత కొన్ని ఆప్షనల్ స్టెప్స్ ని పూర్తిచేసిన తరువాత చూడటానికి క్రింద విధంగా ఒక స్క్రీన్ వస్తుంది(నా ఉద్దేశం ప్రకారం అచ్చంగా ఇలాగే రాదు గానీ కొన్ని కొన్ని తేడాలతో చూడటానికి ఈ విధంగానే ఉంటుంది).ఇక్కడ స్క్రీన్ ఒకసారి గమనిస్తే మీకు ఒకటి అర్ధమవుతుంది అది ఏమిటంటే నేను ఫోటోషాప్ CS3 ,ఫోటోషాప్ 7 లని నా పీసీ లో ఇన్ స్టాల్ చేసినట్లు తెలుస్తుంది.ఇప్పుడు ఈ స్క్రీన్ లో నుండి మీరు ఏ వెర్షన్ ఫోటోషాప్ లోకి ఈ ప్లగ్గిన్ ఇన్ స్టాల్ చెయ్యదలచుకున్నారో ఆ వెర్షన్ ని ఎంచుకోండీ(నేను CS3 ని ఎంచుకున్నాను).తరువాత ఇన్ స్టాల్ అనే బటన్ ని క్లిక్ చెయ్యండి.

3

అంతే అయిపోతుంది.ఇప్పుడు రెండవ రకానికి చెందిన ప్లగ్గిన్స్ ని ఎలా ఇన్ స్టాల్ చెయ్యాలో తెలుసుకుందాం..

ఇప్పుడు చెప్పబోయే రెండవ రకానికి చెందిన ప్లగ్గిన్ లు చూడటానికి క్రింద విధంగా ఉంటాయి .
4

వీటిని సింపుల్ గా కాపీ చేసుకుని C:\Program Files\Adobe\Adobe Photoshop CS3\plug-ins అనే ఫోల్డర్ లోకి పేస్ట్ చెయ్యడమే.ఇక్కడ abobe photoshop cs3 అనే చోట మీరు వాడే వెర్షన్ బట్టి ఈ ఫోల్డర్ పేరు ఆధారపడి ఉంటుంది.అంతే అయిపోయింది.ఇప్పుడు ఇన్ స్టాల్ చేసిన ప్లగ్గిన్ లని ఎలా వాడాలో చూద్దాం.

ఫోటోషాప్ ని ఓపెన్ చేసి ప్లగ్గిన్ ను ప్రయోగించాలనుకున్న ఇమేజ్ ని ఓపెన్ చేసి.Filter మెనూలో మీరు ఇన్ స్టాల్ చేసిన ప్లగ్గిన్ అన్నింటి కంటే చివరన కనిపిస్తూ ఉంటుంది దానిని క్లిక్ చేసి వాడుకోవడమే.క్రింద తెరపట్టు గమనించండి.

5

ఈ ట్యుటోరియల్ పై మీ అభిప్రాయాలను రిప్లై రూపేనా తెలుపగలరు….

2 comments:

aadhi said...

trinadh garu tanks ela cheppalo ardam kavatam ledu

Phani Kumar said...

good

Post a Comment

.

Copyright © Photoshop Tutorials